జయలలిత గెలుపు తమిళనాడును రక్షించింది: రజనీకాంత్

తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యానని, తన నివాస స్థానానికి వచ్చానని, డిశ్చార్జీ కాగానే తొలి ఫోన్ జయలలితకు చేయాలని అనుకున్నానని, అందుకే ఫోన్ చేశానని రజనీకాంత్ చెప్పినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. రజనీకాంత్ కోలుకోవడం పట్ల జయలలిత హర్షం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా రజనీ చెన్నైకి రావాలని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.
రాణా షూటింగ్ సందర్భంగా అస్వస్థతకు గురైన రజనీకాంత్ రెండు సార్లు చెన్నైలోని ఆస్పత్రుల్లో చేరారు. ఆ తర్వాత మూత్రపిండాల చికిత్స కోసం సింగపూర్ వెళ్లారు. రజనీకాంత్ అన్నాడియంకెకు ఓటేసినట్లు వీడియో చానెళ్లు అప్పట్లో క్లిప్పింగులను చూపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications