వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
టి-కాంగ్రెసుకు షాక్: తెలంగాణ ప్రాంతీయ బోర్డు కేంద్రం యత్నాలు

దీంతో షాక్‌కు గురైన పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానానికి మరో 15 రోజులు గడువు ఇచ్చాం కాబట్టి ఆ తర్వాతే రాజీనామాలకు పూనుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. రాజీనామా విషయంలో రెండు వర్గాలుగా విడిపోయినప్పటికీ చివరకు ఈ నెలాఖరు వరకు ఆగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు చిదంబరం, ప్రణబ్‌లను కలిసిన తెలంగాణ మంత్రులకు ఏవిధమైన హామీ రాలేదు. శుక్రవారం ఆంటోని నుండి కూడా ఎలాంటి హామీ రాక పోవడం వారిని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. అయితే సాయంత్రం కోర్ కమిటీ సమావేశం ఉన్నందున ఆంటోనితో వారు తమ బాధను వెల్లబోసుకున్నట్లుగా తెలుస్తోంది.