న్యూఢిల్లీలో తెలంగాణ ప్రకంపనలు: ప్రధాని నివాసంలో కోర్ కమిటీ చర్చ

Manmohan Singh
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రకంపనలు మరోసారి పెల్లుబుకాయి. మూడు రోజుల క్రితం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై స్పష్టమైన హామీతో వస్తామని చెప్పిన టి-కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రెండు రోజులుగా కేంద్రమంత్రులు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ, ఎకె ఆంటోనీ తదితరులతో సమావేశం అయ్యారు. వారి ముందు తెలంగాణ ఆకాంక్షను, తెలంగాణలో ఉన్న సెంటిమెంటు బలాన్ని టి-కాంగ్రెసు నేతలు ఉంచారు. వారి నుండి స్పష్టమైన హామీ రాక పోవడంతో టి-కాంగ్రెసు నేతలు అక్కడే ఉండి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇంట్లో కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ అయింది. ఇందులో తెలంగాణ అంశంపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

టి-కాంగ్రెసు కూడా ఈ భేటీ కేంద్ర మంత్రులతో తమ భేటీకి కొనసాగింపే అని చెబుతున్నారు. మా మనోభావాలు ప్రధాని, ఏఐసిసి అధినేత్రి సోనియాగాంధీకి చెబుతామని కేంద్రమంత్రులు తమకు హామీ ఇచ్చారని ఈ కోర్ కమిటీ సమావేశంలో వారు తమ అభిప్రాయాలను, ఆకాంక్షలను సోనియాకు వెల్లడించనున్నారని అభిప్రాయపడ్డారు. ఆల్ పార్టీ మీటింగ్ పై కూడా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. అయితే అంతకుముందే తెలంగాణపై కాంగ్రెసు అభిప్రాయం వ్యక్తంపర్చాల్సిన ఆవశ్యకతను కూడా వారు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ కోర్ కమిటీ సమావేశంలో లోక్ పాల్ బిల్లు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ వ్యవహారం, అన్నాహజారే వ్యవహారంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు అంశాలపైనే కోర్ కమిటీ ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+