జయశంకర్ భౌతిక కాయాన్ని చూసి ఏడ్చేసిన తెరాస అధినేత కెసిఆర్

జయశంకర్ భౌతిక కాయం వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కూడా ఏడ్చేశారు. జయశంకర్ మృతికి మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ పిలుపునిచ్చారు. జయశంకర్ మృతికి కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి, స్వామి అగ్నివేశ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సంతాపం ప్రకటించారు. జయశంకర్‌ను కడసారి చూసేందుకు హన్మకొండకు పెద్ద యెత్తున తెలంగాణ నాయకులు, ప్రజలు చేరుకుంటున్నారు.
అభ్యుదయ భావాలు కలిగిన జయశంకర్ మృతి బాధాకరమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. సిద్ధాంతాల కోసం జయశంకర్ జీవితాంతం పోరాడారని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించడమే కాకుండా ఓ పార్టీకి పుట్టుకకు కారణమయ్యారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications