సిఆర్‌పిఎఫ్ జవాను కూతురిపై రేప్, ఆత్మహత్య చేసుకున్న బాలిక

అయితే, అత్యాచారాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీరు గర్హనీయంగా ఉంది. రాష్ట్రంలో జనాభా ఎక్కువని, ఇవి చెదురుమొదురు సంఘటనలు మాత్రమేనని, వీటిపై తాము కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పింది. అన్ని కేసుల్లో చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రశాంత్ త్రివేది అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి పూర్తిగా క్షీణించిందని, మహిళలు రోడ్లపై తిరగడమే గగనంగా ఉందని కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జయంతి నటరాజన్ అన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి మాయావతి విఫలమయ్యారని ఆమె విమర్శించారు.
కాగా, రేప్ కేసులపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో జరిగిన అత్యాచారం సంఘటనలపై తనంత తాను విచారణకు స్వీకరించింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు విష్ణు సహాయ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి, హోం శాఖ ముఖ్య కార్యదర్శికి, పోలీసు డైరెక్టర్ జనరల్‌కు, ఎస్‌పిలకు, ఎస్ఎస్‌పిలకు నోటీసులు పంపించారు.












Click it and Unblock the Notifications