రాహుల్ గాంధీ రండి: హైదరాబాద్ అహ్వానించిన మేయర్ కార్తికారెడ్డి

హైదరాబాద్ వచ్చి ప్లాస్టికి నిషేధ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని కూడా ఆమె రాహుల్ గాంధీని కోరారు. అందుకు రాహుల్ గాంధీ సమ్మతించినట్లుగా తెలుస్తోంది. తాను హైదరబాద్ రావడానికి ప్రయత్నం చేస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. తక్కువ సమయంలోనే వ్యక్తులను ఎలా ఇంప్రెస్ చేయాలో కార్తీకరెడ్డికి బాగా తెలుసని ఆమె సన్నిహితులు అంటుంటారంట. అందుకు తగ్గట్టుగానే రాహుల్‌తో తనకు అతి తక్కువ సమయం దొరికినప్పటికీ ఆమె దానిని సద్వినియోగం చేసుకున్నట్టుగానే కనిపిస్తోంది. మరో విషయం ఏమంటే వచ్చే ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పటి నుండి కార్తిక రెడ్డి ప్రయత్నాలు చేస్తుందని కూడా సమాచారం.