వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక అధిష్టానానికి సమైక్యవాద సెగ: త్వరలో ఢిల్లీకి సీమాంధ్ర నేతలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్ర సాధన కోరుతూ తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు అధిష్టానం వద్దకు పలుమార్లు వెళ్లి మొర పెట్టుకున్నారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కూడా హస్తిన బాట పట్టనున్నారు. తెలంగాణ కోరుతూ టి-కాంగ్రెసు అధిష్టానాన్ని అర్థించినట్లుగానే సమైక్యాంధ్రనే ఉంచాలని కోరుతూ సీమాంధ్ర నేతలు త్వరలో ఢిల్లీ పయనం కానున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నట్లుగానే తాము ఒత్తిడి పెంచాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తాము మౌనంగా ఉండటం సరికాదని కాంగ్రెస్‌లోని సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట సమైక్యాంధ్ర గళం మరో సారి గట్టిగా వినిపించాలన్నది వీరి యోచన. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్తితుల్లోను తాము అంగీకరించేది లేదని వారు అధిష్టానానికి చెప్పేందుకు మరికొద్ది రోజుల్లో ఢిల్లీ పయనం కానున్నట్లుగా తెలుస్తోంది. సమైక్యాంధ్ర ప్రజా ప్రతినిధుల ఫోరం కన్వీనర్ సాకే శైలజానాథ్ నేతృత్వంలో తాము వెళతామని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఈ మేరకు ప్రకటించారు కూడా.

కాంగ్రెస్‌లోని సీమాంధ్ర ఎంపీలు రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు వంటి వారు కూడా మళ్లీ సమైక్య గళం విప్పుతున్నారు. సమైక్యవాదుల భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు శైలజానాథ్ గురువారం నుంచి మంత్రులు, ప్రజా ప్రతినిధులందరితోనూ భేటీ కానున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ నెలాఖరులోగాని వచ్చే నెల మొదటి వారంలోగాని అధిష్ఠానాన్ని కలిసేందుకు సమయం తీసుకునే బాధ్యతను సీమాంధ్ర ఎంపీలకు శైలజానాథ్ అప్పగించారు. ఇందుకోసం అధిష్ఠానం అపాయింట్‌మెంట్ బాధ్యతలు లగడపాటి, అనంత వెంకట్రామిరెడ్డి, కావూరి, రాయపాటి తీసుకున్నారని తెలుస్తోంది. ఈసారి అధిష్టానాన్ని కలిసినప్పుడు రాష్ట్ర విభజన విషయాన్ని త్వరలో తేల్చమని, దానిపై నాన్చుడు ధోరణి సరికాదని అధిష్టానానికి సూచించేందుకు కూడా వారు సిద్ధమయ్యారని తెలుస్తోంది. చిదంబరం ప్రకటనతోనే రెండు వాదనలు తీవ్రస్థాయికి చేరాయని, అంతకుముందు అంత వేడి తెలంగాణలో లేకుండెనని సీమాంధ్రులు అధిష్టానానికి సూచించేందుకు సిద్ధమయ్యారని సమాచారం.

చిదంబరం రగిల్చిన వేడిని అధిష్టానమే తగ్గించాలని వారు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరే అవకాశం ఉంది. అయితే ప్రత్యేక రాష్ట్ర ప్రకటించకుండా ప్రత్యేక సహాయం, రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి తోడ్పడటం తదితర నిర్ణయాలు తీసుకోవాలని వారు అధిష్టానాన్ని కోరనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో అభివృద్ధి ఏదో ఒక నగరం చుట్టూనే కేంద్రీకృతం కాకుండా అన్ని ప్రాంతాలకూ విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కూడా సీమాంధ్ర నేతలు కోరుతున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా తమ ఈ వాదనలనన్నింటినీ సమగ్రంగా అధిష్ఠానం ఎదుట ఉంచేందుకు వీరు సిద్ధమవుతున్నారు.

English summary
Seemandhra Congress leaders are planning to go New Delhi soon for demand united Andhra Pradesh. They may go on the month of end or July first week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X