ప్రజాసేవ చేయాలని లేదు: వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్
Districts
oi-Srinivas G
By Srinivas
|
అనంతపురం: రాష్ట్రంలో ప్రజా సేవ చేయాలనే ఆలోచన ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదని వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తన ఓదార్పు యాత్రలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను ఉద్దేశించి అన్నారు. గురువారం జగన్ తన నాలుగో రోజు ఓదార్పు యాత్రను అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టిడిపి, కాంగ్రెసుపై ద్వజమెత్తారు. అధికార కాంగ్రెసు పార్టీ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే, వాటిని ఎత్తి చూపాల్సిన తెలుగుదేశం మౌనంగా ఉందని అన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ఎప్పటికీ ప్రజలకు గుర్తుండి పోతాయని అన్నారు. తన పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఎన్ని జన్మలెత్తినా మర్చిపోనని అన్నారు. కాగా అంతకుముందు ఆయన పెనుకొండ నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. పెనుగొండ శివారులోని ఆంజనేయస్వామి ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు.