కడప: ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు, పలువురు ముఖ్య నేతలే సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇవ్వవద్దని చిరంజీవికి చెబుతున్నారని కాంగ్రెసు పార్టీ కడప జిల్లా శాసనసభ్యుడు వీరశివారెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇస్తారని చెప్పడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో కడప జిల్లా నుండి పారిపోయిన సి.రామచంద్రయ్యకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను తమపై రుద్ద వద్దని ఆయన కోరారు.
బలహీనుడైన ఆయనకు మంత్రి పదవి ఇస్తే తాము వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, తెలుగుదేశం పార్టీని ఎలా ఎదుర్కొనగలమని ప్రశ్నించారు. నేరుగా శాసనసభకు ఎన్నికైన వారికే పదవి ఇవ్వాలని ఆయన సూచించారు. త్వరలో కడప జిల్లాకు చెందిన కాంగ్రెసు పార్టీ నేతలం చిరంజీవిని కలిసి ఈ విషయాన్ని చెబుతామని అన్నారు.
Kamalapuram MLA Veera Siva Reddy said today that PRP also opposing minister post to C Ramachandraiah. He said they will not face TDP and YS Jagan if congress give minister to C Ramachandraiah.
Story first published: Friday, June 24, 2011, 15:24 [IST]