కాంగ్రెసు పెద్దల డైరీ జగన్ వద్ద అందుకే భయం: ఎర్రన్నాయుడు
Districts
oi-Srinivas G
By Srinivas
|
విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాంగ్రెసు నేతల డైరీ ఉందని అందుకే కేంద్ర, రాష్ట్ర కాంగ్రెసు ప్రభుత్వాలు ఆయనకు భయపడుతున్నాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రన్నాయుడు శుక్రవారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రులు, శాసనసభ్యులు అంటే వణుకు అని విమర్శించారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు భూకబ్జాల్లో ఉన్నందునే హౌస్ కమిటీ వేయలేదని విమర్శించారు. వారికి భయపడి హౌస్ కమిటీ వేసే ధైర్యం కిరణ్‌కు లేదన్నారు.
వైయస్ జగన్‌కు దమ్ముంటే గవర్నర్ నరసింహన్ ముందుకు వెళ్లి తన బలం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. జగన్ తెలుగుదేశం పార్టీపై, పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజా సమస్యలు ప్రభుత్వం పరిష్కరించడం లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు.
TDP senior leader Yerram Naidu blamed today that state and central government is fear of YSR Congress party chief YS Jagan. Jagan have congress leaders dairy with him.
Story first published: Friday, June 24, 2011, 11:07 [IST]