బాబా రామ్‌దేవ్‌కు అన్నా హజారే షరతులు, అంగీకరిస్తేనే వేదిక
National
oi-Pratapreddy
By Pratap
|
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లు కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన తన నిరాహార దీక్షలో పాల్గొనడానికి అనుమతించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆగస్టులో చేపట్టబోయే దీక్షలో పాల్గొనడానికి బాబా రామ్‌దేవ్ బాబాకు షరతులు పెడుతున్నారు. బాబా రామ్‌దేవ్ దీక్షకు కూడా అన్నా హజారే ఇంతకు ముందు మద్దతిచ్చారు. తనతో పాటు దీక్షలో పాల్గొనాలంటే బాబా రామ్‌దేవ్ తాను విధించే షరతులకు అంగీకరించాల్సి ఉంటుందని, కలిస్తే వాటిపై చర్చిస్తానని ఆయన ఆదివారం రాత్రి మహారాష్ట్రలో టీవీ చానెల్ ప్రతినిధులతో చెప్పారు.
కొన్ని అంశాలుపై చర్చించిన తర్వాతనే బాబా రామ్‌దేవ్‌ను తన దీక్షలో పాల్గొనడానికి అనుమతిస్తామని ఆయన చెప్పారు. సమర్థమైన లోక్‌పాల్ బిల్లు కోసం ఆగస్టు 16వ తేదీన జంతర్ మంతర్ వద్ద మరోసారి దీక్ష చేస్తానని అన్నా హజారే ఇప్పటికే ప్రకటించారు. ఆదివారంనాడు ఢిల్లీకి వచ్చిన రామ్‌దేవ్ - పోలీసులు తనను చంపడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
After allowing Baba Ramdev to share the dais with him during his fast in Jantar Mantar in April and later voicing support to the yoga guru, veteran Gandhian Anna Hazare has now laid down a set of "conditions" for Ramdev before letting him join his proposed fast in August.
Story first published: Monday, June 27, 2011, 15:47 [IST]