బొత్స సత్యనారాయణ లీడ్, వంట గ్యాస్ ధర తగ్గింపునకు కసరత్తు

ఆర్టీసి చార్జీల పెంపు వల్ల ప్రజలపై పెద్ద యెత్తున భారం పడకుండా డీజిల్ అమ్మకం పన్నును కూడా తగ్గించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. ఆర్టీసి బస్సు చార్జీలు పెంచే ప్రతిపాదనకు కూడా రవాణా శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ అంగీకరించారు. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిని కూడా అధ్యయనం చేస్తామని యన చెప్పారు. ఆర్టీసి బస్సు చార్జీలను పొరుగు రాష్ట్రాల్లో కూడా పెంచారని, ఆర్టీసి తీవ్రమైన నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచకపోతే నష్టాల నుంచి గట్టెక్కడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారని ఆయన అన్నారు. సామాన్యులపై భారం పడకుండా ఆర్టీసి బస్సు చార్జీలను పెంచుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications