చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అధికారం కోసం రాలేదు: చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని పేదవారికోసం, ప్రజలకోసం రాజకీయాల్లోకి వచ్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో అన్నారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజల రక్తాన్ని తాగేలా ప్రవర్తిస్తోందన్నారు. ప్రభుత్వం తన నియోజకవర్గం అయిన కుప్పంపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. కుప్పం నియోజకవర్గానికి నిధులు ఇవ్వకుండా అధికార కాంగ్రెసు అడ్డుకుంటుందని ఆరోపించారు.

మద్యం ధరలను, పెట్రోలు, డీజీల్ ఇతర నిత్యావసర ధరలను పెంచి పేదల సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోచుకుంటున్నాయన్నారు. ప్రభుత్వాల వైఫల్యాల వల్ల ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని కాంగ్రెసు నేతలు రాష్ట్రాన్ని, దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందన్నారు. కాంగ్రెసు హయాంలో అన్ని వర్గాలకు సక్రమంగా ఆదాయం పంపిణీ కావడం లేదన్నారు. వ్యవసాయం

రాష్ట్రంలో కొత్తగా వచ్చిన పార్టీలను ప్రజలు నమ్మ వద్దని చంద్రబాబు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎన్నో వెళ్లాయి అన్నారు. అనంతరం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పాఠశాల భవనం ప్రారంభించారు. కాగా అంతకుముందు చంద్రబాబు ఎడ్లబండికి సిలిండర్ కట్టి వినూత్న నిరసన తెలిపారు.

English summary
Telugudesam party president Chandrababu Naidu said today that NTR entered in to politics for public. He said congress is anti public party. He toured in Kuppam constituency today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X