హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ తెలంగాణకే రాజధానిగా ఉంటుంది: లగడపాటి రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: రాష్ట్రం విడిపోతే హైదరాబాద్ తెలంగాణకే రాజధానిగా ఉంటుందని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలా, వద్దా అనే అంశంపై తమ కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌ను కలిసిన అనంతరం ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఒక వేళ రాష్ట్రం రెండుగా విడిపోతే, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు దూరంగా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ రాజధానిగా ఉండబోదని, హైదరాబాదును మినహాయించి విభజన జరిగితే తెలంగాణకు కరీంనగరో, వరంగల్లో రాజధానిగా ఉంటుందని ఆయన అన్నారు.

14ఎఫ్‌ను తొలగించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. 14ఎఫ్ తొలగింపుతో ఎస్సై రాత పరీక్షలకు సంబంధం లేదని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కూడా సాధ్యం కాదని ఆయన అన్నారు. వర్గీకరణకు బిఎస్పీ నేత మాయావతి మద్దతు ప్రకటించడాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, చాలా మంది మద్దతిస్తామని అంటారని, అయితే మాటల్లో చెప్తే సరిపోదని, తీర్మానం చేయాల్సిన అవసరం ఉంటుందని, మాటల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. మాయావతి బలపరిస్తే, ములాయం వ్యతిరేకిస్తారని ఆయన అన్నారు. తన మాటలను బట్టి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తాను ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ప్రభుత్వానికి కొన్ని పద్ధతులు, సంప్రదాయాలు ఉంటాయని, వాటి ప్రకారమే పని చేస్తుందని ఆయన అన్నారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో తనకు షేర్లు ఉన్నట్లు రుజువు చేస్తే వాటిని నిరూపించినవారికే ఇచ్చేస్తానని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు చేసిన వ్యాఖ్యపై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు.

కాగా, ఎస్సై రాతపరీక్షలు యధావిధిగా ఆస్టు 13, 14 తేదీల్లో జరుగుతాయని రాష్ట్ర హోం మంత్రి సిబితా ఇంద్రారెడ్డి సోమవారం హైదరాబాదులో ప్రకటించారు. ఐదు, ఆరు జోన్ల అభ్యర్థులు పరీక్ష రాస్తారని ఆమె చెప్పారు. హైదరాబాదు ఆరో జోన్ కిందికే వస్తుందని ఆమె చెప్పారు. 14ఎఫ్ తొలగింపునకు మార్గం సుగమమైందని ఆమె అన్నారు. తెలంగాణ అభ్యర్థులు ఎస్సై రాతపరీక్షలు రాస్తారని ఆమె చెప్పారు.

English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopal said that Hyderabad will be capital of Telangana, if AP divides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X