'కాంగ్రెసుపై కాకుండా టిడిపిపై ఒత్తిడి వెనుక నాగం ఆంతర్యం ఏమిటి'
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది మేమే అంటున్న కాంగ్రెసు పార్టీని ఒత్తిడి చేయాల్సింది పోయి తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి చేయడం వెనుక ఆంతర్యమేమిటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి సోమవారం తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రమంత్రి చిదంబరం వ్యాఖ్యల ద్వారా కాంగ్రెసుపై ఒత్తిడి తేవాల్సిన ఆవశ్యకత కనిపిస్తోందన్నారు.
తెలంగాణకు చెందిన అన్ని పార్టీల నేతలు కలిసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని అన్నారు. తెలంగాణ కోసం పార్టీలకతీతంగా పని చేయాలని సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు కేంద్ర బలగాలను దించే చర్యలకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని తెలంగాణ నేతలు కేంద్రం తీరును సమష్టిగా ఎదుర్కోవాలని ఆయన కోరారు.