వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ నేతలు దీక్షకు దిగితే ఎదుర్కుంటా: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాత పాటే పాడారు. తెలంగాణపై సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సరైన సమయంలో రాలేదా అని మీడియా ప్రతినిధులు అడిగితే అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన జవాబిచ్చజారు. తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఆమరణ దీక్షకు దిగితే ఎలా ఎదుర్కోవాలో తనకు తెలుసునని, గత ఆరు నెలల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కున్నానని, ఇప్పుడు దీన్ని కూడా ఎదుర్కుంటానని ఆయన చెప్పారు. మెట్రో రైలు ప్రాజెక్టు ఒప్పందం తాను ముఖ్యమంత్రిని కాక ముందే జరిగిందని, చారిత్రక కట్టడాలేవీ మెట్రో రైలు ప్రాజెక్టు కిందికి రావని ఆయన చెప్పారు.

తాను ఢిల్లీలో ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రులు ఆంటోనీ, ఆజాద్‌లను, రాహుల్ గాంధీని కలిశానని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను వారి ముందుంచానని ఆయన చెప్పారు. 14ఎఫ్ నిబంధనను తొలగించాలని తాను ప్రధానిని కోరానని, దాన్ని తొలగిస్తే హైదరాబాద్ ఆరో జోన్‌లోకి వస్తుందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్యను కూడా పరిష్కరించాలని కోరినట్లు ఆయన చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ఇందిరా క్రాంతీ పథకం కింద డ్వాక్రా మహిళలకు ఇస్తున్న రుణాలపై వడ్డీ రాయితీ కల్పించాలని తాను కోరినట్లు ఆయన తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఆర్థిక సహాయం అందించాలని గులాం నబీ ఆజాద్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. వంద కోట్ల రూపాయలతో మహిళా బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వంటగ్యాస్‌పై తాము ఇప్పటికే 25 రూపాయల చొప్పున రాయితీ ఇస్తున్నామని, తద్వారా ఏడాదికి 200 కోట్ల భారాన్ని భరిస్తున్నామని ఆయన చెప్పారు. ఆ రకంగా వంటగ్యాస్ ధర తగ్గించడానికి రాయితీ ఇవ్వబోమని ఆయన పరోక్షంగా చెప్పారు. కృష్ణా జిల్లాలో 365 ఎకరాల్లో మిసైల్ లాంచర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఐదు చోట్ల బిడిఎస్ పరిశ్రమలు వస్తాయని ఆయన చెప్పారు.

English summary
CM Kiran Kumar Reddy said that he will face, if Telangana Congress leaders go on fast on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X