హైదరాబాద్: తెలంగాణ రాజీనామాస్త్రాలను ఎదుర్కోవడానికి సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి శైలజానాథ్ సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి దేనికైనా సిద్ధపడతామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అందుకు తాము ఏమైనా చేస్తామని, తాము ఏం చేయగలమో చూశారు కదా అని కూడా వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతల రాజీనామాల వ్యవహారాలను తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. సీమాంధ్ర నాయకులమంతా ఈ నెల 5వ తేదీన ఢిల్లీకి వెళ్తున్నామని, శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలు చేయాలని కోరుతామని ఆయన చెప్పారు.
కాగా, ప్రభుత్వాలని కూలదోస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసే దిశగా నడవాలని ఆయన సూచించారు.
Minister from Seemandhra Shailajanath said that they will protect Andhrapradesh state. He also said that they appeal to the Congress high command to implement Srijrishna committee report.
Story first published: Friday, July 1, 2011, 19:04 [IST]