ఆవేదనతోనే తెలంగాణ నేతల రాజీనామాల నిర్ణయం

రాజీనామాల విషయంలో తొందరపడవద్దని, పునరాలోచించుకోవాలని బొత్స సత్యనారాయణ తమకు చెప్పినట్లు మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. తెలంగాణ విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటుందని కూడా చెప్పారని ఆయన అన్నారు. శుక్రవారం జరిగిన పరిణామాలను తాము బొత్స సత్యనారాయణకు వివరించినట్లు మరో మంత్రి సారయ్య చెప్పారు. ప్రజల అభీష్టం మేరకే తాము రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నామని తాను బొత్సకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తమపై ఉన్న ఒత్తిళ్లను అర్థం చేసుకోవాలని తాము చెప్పామని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాలను గౌరవిస్తూనే ప్రజల మనోభావాలను గౌరవిస్తామని మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications