రంగంలోకి కిరణ్, బొత్స: తెలంగాణ మంత్రులతో భేటీ

కాగా, శనివారం ఉదయం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి శనివారం సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు జానా రెడ్డి నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ మంత్రులు సారయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. ఇదే సమయంలో బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రులను పార్టీ కార్యాలయం గాంధీభవన్‌కు ఆహ్వానించారు. మంత్రులకు ఫోన్ చేసి ఆయన ఆహ్వానాలు పలికారు. రాజీనామాలు చేయాలనే నిర్ణయంపైనే బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రులతో మాట్లాడనున్నారు.
రాజీనామాల వల్ల ప్రభుత్వం పడిపోయి రాజకీయ సంక్షోభం ఏర్పుడుతుంది గానీ తెలంగాణ రాదని గులాం నబీ ఆజాద్ తన సందేశంగా తెలంగాణ ప్రజాప్రతినిధులకు చెప్పాలని బొత్స సత్యనారాయణ ఆదేశించినట్లు సమాచారం. ఇటువంటి చర్యల వల్ల పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుందని ఆజాద్ చెప్పినట్లు సమాచారం. తెలంగాణ ప్రజాప్రతినిధులను బుజ్జగించాలని ఆయన బొత్స, కిరణ్ కుమార్ రెడ్డిలను ఆదేశించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications