కెసిఆర్ ట్రాప్‌లో టి- నేతలు పడొద్దు: రఘువీరా

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ది ఓదార్పు యాత్ర కాదు, ముమ్మాటికీ రాజకీయ యాత్రేనని మంత్రి విమర్శించారు. వైఎస్ పేరు చెప్పుకుని ప్రభుత్వాన్ని, ప్రజల్ని జగన్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను తుడిచిపెట్టాలని కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి విమర్శించారు. కెసిఆర్ కాంగ్రెసు తెలంగాణ నేతలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు.
సమైక్యాంధ్రలోనే అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెసు సీమాంధ్ర శాసనసభ్యుడు మల్లాది విష్ణు అన్నారు. తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ఉండాలని పార్టీ అధిష్టానాన్ని కోరడానికి తాము ఈ నెల 6,7 తేదీల్లో ఢిల్లీలో ఉంటామని ఆయన చెప్పారు.