గూగుల్ ప్లస్‌ని మెచ్చిన చైనా, అందుకే బ్లాక్ చేయలేదు

చైనా ప్రజలను ఆందోళనలకు గురి చేస్తాయన్న ఉద్దేశ్యంతో చైనాలో ఫేస్‌బుక్, ట్విట్టర్, ఫ్లిక్కర్, ఫోర్ స్కేర్ లాంటి వాటిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఐతే గూగుల్ ప్లస్ లోకి లాగిన్ అవుతుంటే మాత్రం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నట్లు వెల్లడించారు. అవి ఏమిటంటే గూగుల్ ప్లస్ యుఆర్‌ఎల్ లోకి వెళ్శగానే అది HTTPS secure connectionలోకి వెళ్శడమే ఈ ప్రాబ్లమ్స్‌కి కారణం అని అంటున్నారు.
గతంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫీసియల్స్, చైనా పోలిటికల్ యాక్టివిస్ట్‌లకు సంబంధించినటువంటి జీమెయిల్స్ ఎకౌంట్స్ హ్యాకింగ్ చేయడం జరిగిందని టెక్నాలజీ గెయింట్ గూగుల్ చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీద ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. జీమెయిల్ హ్యాకింగ్ విషయంపై చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ గూగుల్‌కి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్నింగ్ ఏమిటంటే జీమెయిల్ హ్యాకింగ్ చైనా ప్రభుత్వమే దగ్గరుండి మరీ హ్యాకింగ్ చేయిందని జీమోయిల్ ఆరోపిస్తుంది. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. గూగుల్ కంపెనీ కావలనే మాపై ఆరోపణలు చేస్తుందని అన్నారు.