వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాజీనామాలపై అధిష్టానం సీరియస్, బుజ్జగింపులు

సోమవారం టి-కాంగ్రెసు రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆదివారం సైతం అధిష్టానం బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే మంత్రులు శ్రీధర్ రెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య తదితరులు ఉధయం పిసిసి చీఫ్ బొత్సతో భేటీ అయ్యారు. వారితో బొత్స టి-కాంగ్రెసు రాజీనామాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే అధిష్టానం బుజ్జగింపులను టి-కాంగ్రెసు బేఖాతరు చేస్తోంది. తాము బుజ్జగింపులకు లొంగేది లేదని, తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాకే తాము వెనక్కి తగ్గుతామని కెకె ఆ తర్వాత చెప్పారు.