హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరింపబడిన నాగం జనార్దన్ రెడ్డి ఆదివారం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. నాగంతో పాటు ఆయన బృందంలోని హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న, వేణుగోపాలచారి సైతం రాజీనామా పత్రాలపై సంతకం చేశారు. అనంతరం వాటిని సభాపతి కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా నాగం మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకే తాము రాజీనామా చేసినట్లు చెప్పారు. ఆయన తన దీక్షా స్థలి నుండే రాజీనామా పత్రాలను సభాపతి కార్యాలయానికి పంపించారు.
అంతకుముందు ఆయన దీక్షను ప్రారంభించిన సమయంలోనే తాము ఆదివారమే రాజీనామా చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా కాంగ్రెసు నేతలు సోమవారం రాజీనామాకు సిద్ధపడిన నేపథ్యంలో నాగం బృందం అంతకుముందే రాజీనామా చేసి రాజీనామా పరంపరకు తెర తీసింది. ఒక రోజు ముందే నాగం బృందం రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభానికి తెర లేపింది.
Nagam Janardhan Reddy was resigned for his mla post today. Harishwar Reddy, Venugopala Chary, Jogu Ramanna also sent theire resignation to speaker office.
Story first published: Sunday, July 3, 2011, 14:21 [IST]