వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

48 గంటల తెలంగాణ బంద్: జెఏసి పిలుపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana JAC
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా మంగళ, బుధవారం 48 గంటల సంపూర్ణ బందుకు తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి సోమవారం పిలుపునిచ్చింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ రాజీనామాలకు సంఘీభావంగా తెలంగాణ ఐకాస బందుకు పిలుపునిచ్చింది. ఆ తర్వాత 7న విద్యార్థుల ర్యాలీ, 8, 9 తేదీల్లో రైలు రోకో, ముఖ్యంగా దేశ రాజధాని న్యూఢిల్లీ వెళ్లే రైళ్లని ఆపాలని జెఏసి నిర్ణయించుకుంది. 10వ తారీఖున వంటావార్పు ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత వరుసగా ప్రతి రోజు తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టే వరకు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం చేయాలని జెఏసి నిర్ణయించుకుంది. ఉద్యమానికి అందరూ మద్దతు పలకాలని కోరింది. ఉద్యోగ సంఘాలు కూడా నిరవధిక సమ్మె చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి 48 గంటల బందుకు తెలంగాణలోని అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కోరారు. పార్లమెంటులో బిల్లు పెట్టే వరకు తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సుమారు 100 మంది రాజీనామా చేసినప్పటికీ చిదంబరం దానిని లైట్‌గా తీసుకొని తెలంగాణ ప్రజలకు బాధ కలిగించారని అన్నారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు నిరవధిక సమ్మెకు సన్నద్ధం అవుతున్నాయన్నారు. తెలంగాణ నేతల రాజీనామాలపై కేంద్రం స్పందించక పోవడం బాధాకరం అన్నారు. సింగరేణి కార్మికులు కూడా బందుకు సహకరించాలని కోరారు.

కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేసిన నేపథ్యంలో తెలంగాణ స్టీరింగ్ కమిటీ అత్యవసరంగా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను రూపొందించింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్‌తో పాటు కెసిఆర్ కూడా మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

English summary
Telangana JAC call to 48 hours band in telangana from tomorrow onwards. JAC will organiged student rally on 7th, rail roko on 8th and 9th, cooks on roads on 10th of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X