వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ నేతలను చర్చలకు ఆహ్వానించిన ఆజాద్

కాగా, తెలంగాణ అంశం జఠిలమైందని, దీనిపై అందరితో చర్చించాల్సిన అవసరం ఉందని గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇప్పటికే కొందరిని తాము ఢిల్లీకి అహ్వానించామని, వారితో చర్చలు జరుపుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఎనమండుగురు స్పీకర్ కార్యాలయం వద్ద నిరీక్షిస్తున్నారు. స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం వారు ప్రయత్నిస్తున్నారు. స్పీకర్ ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు. వారు సమయానికి రాకపోవడంతో కార్యాలయం నుంచి స్పీకర్ మీరా కుమార్ వెళ్లిపోయారు. వారు సమయానికి రాలేదని మీరా కుమార్ చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు స్పీకర్ కార్యాలయానికి చేరుకున్నారు.