కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి రాజీనామా ఇప్పుడు లేనట్లే!

S Jaipal Reddy
హైదరాబాద్: కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేసే పరిస్థితి కనిపించడం లేదు. రాజీనామా కోసం మొదటి నుండి జైపాల్ రెడ్డి విముఖత చూపుతున్నట్టుగానే వార్తలు వినిపించాయి. సోమవారం టి-కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయడానికి లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ అనుమతి కోరారు. జైపాల్ రెడ్డి మాత్రం రాజీనామా చేయడానికి సంసిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఆయన కాబినెట్లో ఉన్నందునే రాజీనామా చేయడం లేదని ఎంపీ మంద జగన్నాథం సోమవారం ఢిల్లీలో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించాల్సిన జైపాల్ రెడ్డి తన పాత్ర పోషించడం లేదనే ఆరోపణలు గత కొన్నాళ్లుగా విని వస్తున్నాయి. ఆయన తీరు పట్ల తీవ్ర అసంతృప్తికి లోనైన పలువురు తెలంగాణ వాదులు ఆయనను తెలంగాణ ద్రోహిగా సైతం పేర్కొన్నారు.

ఇటీవల బొత్స సత్యనారాయణ పిసిసి పగ్గాలు చేపడుతున్న సమయంలోనూ ఆయన ప్రాంతీయ వాదం, ఉప ప్రాంతీయ వాదానికి తాము వ్యతిరేకమని జాతీయ వాదమే సరియైనదని చెప్పిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే లేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ తెలంగాణ వాదులలో మాత్రం ఆయన ఆగ్రహం తగ్గలేదు. ఎంపీలంతా రాజీనామా చేసిన సమయంలో జైపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని పలువురు యోచించారు. ఎంపీలు సైతం పలుమార్లు తమకు జైపాల్ రెడ్డి అండగా ఉన్నారని చెప్పుకొచ్చారు, ఇప్పటికీ చెప్పుకొస్తున్నారు. కానీ ఎంపీలు రాజీనామా చేస్తున్నప్పటికీ జైపాల్ రెడ్డి వెనక్కి తగ్గి తెలంగాణకు ఆయన సుముఖంగా లేరనే భావన తెలంగాణ ప్రజల్లో కలిగిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+