కొండా సురేఖ డిమాండుపై దుమ్మెత్తిపోసిన కెసిఆర్

రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధులతో బస్సు యాత్ర చేపట్టే విషయంపై జెఎసి సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యుల రాజీనామాలను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యులు చంద్రబాబుతో సానుకూల వైఖరి ప్రకటింపజేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై తెలుగుదేశం వైఖరిని చెప్పాల్సింది చంద్రబాబునాయుడేనని ఆయన అన్నారు. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రకటనను ఆయన తప్పు పట్టారు. 2004 ఎన్నికల సమయంలో తన ఇంటికి వచ్చినప్పుడు తెలంగాణ సున్నితమైన అంశమని ఆజాద్‌కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థాయి నాయకులు ఇంతగా దిగజారడం సరి కాదని ఆయన అన్నారు. రాజీనామాలకు కాంగ్రెసు అధిష్టానం కంగు తిన్నదని, తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని ఆయన అన్నారు.
రాజీనామా చేసిన హోం మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశానికి వెళ్లడాన్ని తెరాస పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి తప్పు పట్టారు. ఆ విధంగా వెళ్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆమె అన్నారు. మంత్రుల రాజీనామాలను ప్రజలు డ్రామాగా చూస్తారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications