రాజ్యసభ సభ్యత్వానికి కె. కేశవరావు రాజీనామా

కాగా, కాంగ్రెసు సికింద్రాబాద్ లోకసభ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ రాజీనామాకు ముందుకు రావడం లేదు. ఆయన ఎక్కడున్నారనే విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు. అమెరికాలో ఉన్న నిజామాబాద్ లోకసభ సభ్యుడు మధుయాష్కీ ఫాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపించారు. లోకసభ సభ్యులు సర్వే సత్యనారాయణ, సురేష్ షెట్కర్ రాజీనామాలు చేయడానికి తొలుత అంగీకరించలేదు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చర్చలు జరిపిన తర్వాత వారు రాజీనామాలకు మొగ్గు చూపారు. తాను రాజీనామాకు విముఖత చూపలేదని, తన కుమారుడిని చెన్నై పంపించే పనిలో రావడానికి జాప్యం జరిగిదని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూడా రాజీనామాకు సిద్ధపడడం లేదు.












Click it and Unblock the Notifications