హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వరంగల్ జిల్లా శాసనసభ్యురాలు కవిత సోమవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద చిందేసి హల్ చల్ సృష్టించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల శాసనసభ్యులు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి చెందిన 33 మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన అనంతరం ఆ పార్టీకి చెందిన కవిత అమరవీరల స్థూపం వద్ద ఆనందం పట్టలేక డాన్సు చేసింది.
ప్రత్యేక తెలంగాణ కోసం సంక్షోభం సృష్టించడానికి సిద్ధమని ప్రకటించిన టిడిపి రాజీనామాలు చేసి బయటకు రాగానే పలువురు గిరిజనులు డప్పులు, వాద్యాలతో టిడిపి నేతల వద్దకు వచ్చారు. డాన్సు చేస్తున్న మిగతా గిరిజన మహిళలతో కలిసి కవిత కూడా చిందేసింది. కవిత డాన్సు ఆకట్టుకుంది. బంజారాల పద్ధతిలో వారు డాన్సు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు డాన్సు చేస్తున్న కవితను మరింత ఉత్సాహపరచడం విశేషం.