90కి చేరిన తెలంగాణ ఎమ్మెల్యేల రాజీనామాలు

కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన 43 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. ఎల్బీ నగర్ శాసనసభ్యుడు ఫాక్స్ ద్వారా సాయంత్రం రాజీనామా చేశారు. వీరిలో ఇద్దరు ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులతో పాటు కాంగ్రెసుకు మద్దతిస్తున్న స్వతంత్ర శాసనసభ్యులు కూడా ఉన్నారు. మంత్రులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేశారు, కానీ మంత్రిపదవులకు రాజీనామా చేయలేదు. తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు 15 మంది ఉండగా 12 మంది రాజీనామాలు చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంతానికి చెందిన 12 మంది లోకసభ సభ్యులుండగా 9 మంది రాజీనామా చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐదుగురు రాజ్యసభ సభ్యులుండగా కేశవ రావు మాత్రమే రాజీనామా చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన 11 మంది శాసనసభ్యులు, బిజెపికి చెందిన ఇద్దరు శానససభ్యులు, సిపిఐకి చెందిన నలుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల రాజీనామాలు ఆమోదం పొందిన తర్వాత వారు రాజీనామాలు చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకం కావడంతో సిపిఎంకు చెందిన ఓ శానససభ్యుడు రాజీనామా చేసే అవకాశాలు లేవు. అలాగే, మజ్లీస్‌కు చెందిన ఏడుగురు శాసనసభ్యులు కూడా రాజీనామాలు చేయకపోవచ్చు. తెలంగాణలో మొత్తం 119 శానససభా స్థానాలుండగా, ఇప్పటికే పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా ఆమోదం పొందింది.












Click it and Unblock the Notifications