వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాలు: జగన్ ప్రమేయంపై సోనియా ఆరా

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ‌: తమ పార్టీ పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు, ఎమ్మెల్సీలు రాజీనామా చేయడం వెనక తెలంగాణ ప్రజల ఒత్తిడి కాకుండా ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కాంగ్రెసు అధిష్టానం పెద్దలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. గత రెండు రోజులుగా పార్లమెంటు సభ్యులతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏ మేరకు ఉందనే విషయంపై వారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులతో జరుగుతున్న చర్చల్లో ఈ అంశంపై ఏమైనా సంకేతాలు అందుతాయా అనే విషయంపై కూడా కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ దృష్టి పెట్టారు.

రాజీనామాలు చేసిన ప్రజాప్రతినిధుల్లో కొంత మందిని వెనక్కి రప్పించగలమా అనే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నారు. ఇందుకు తగిన ప్రతిపాదనలను ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగం నుంచి 14ఎఫ్ నిబంధనను తొలగించడం, తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలు వారి వద్ద ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
వైయస్ జగన్ ప్రమేయమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు పాత్ర ఏ మేరకు ఉందనే విషయంపై కూడా దృష్టి పెట్టారు. వీటన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి తమకు అనుకూలంగా ప్రజాప్రతినిధులను మలుచుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, రాజీనామాలపై మజ్లీస్ నాయకులతో కూడా మాట్లాడుతున్నామని, తెలంగాణ కోసం రాజీనామాలు చేయాలని కోరుతున్నామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ హైదరాబాదులో చెప్పారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధులు ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆయన అన్నారు.

English summary
AICC president Sonia Gandhi is keen on YSR Congress party president YS Jagan's role behind the Telangana resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X