రాష్ట్ర పరిస్థితి అంతా గమనిస్తున్నా: బొత్స వ్యాఖ్యలు
State
oi-Srinivas G
By Srinivas
|
హైదరాబాద్: రాష్ట్రంలో పరిస్థితిని అంతా తాను నిశితంగా గమనిస్తున్నానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. సమస్య తీవ్రతను బట్టి ఇరు ప్రాంతాల నేతలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. ఇరు ప్రాంతాల నేతలతో ఉమ్మడి సమావేశం నిర్వహించి సమస్యపై చర్చిస్తామని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించే విషయంలో మీడియా సైతం నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం పూర్తి కాలం ఉండాలని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆయన అకాంక్షించారు.
తెలంగాణ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఢిల్లీ పెద్దలతో పాటు రాష్ట్ర నేతలు, ప్రజలు కూడా ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ఆందోళనలకు దిగుతున్న వారి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చునన్నారు. వారి సమస్యలను బట్టి వారు ఆందోళన చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆయన కాంక్షించారు. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అలాగే తెలంగాణ సమస్యకూ పరిష్కారం దొరుకుతుందన్నారు.