జగన్‌ను ఢీకొట్టేందుకు వైయస్ మిత్రుడు కెవిపి రెడీ

వైద్య కళాశాలలో తాము ఒకే గదిలో ఉండేవాళ్లమని, అప్పుడే తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి రావాలని అనుకునేవాళ్లమని ఆయన అన్నారు. ప్రతి విషయంపై వైయస్సార్ తనతో చర్చించేవారని, కొన్ని విషయాల్లో తాను విభేదించేవాడినని ఆయన చెప్పారు. వైయస్ మరణంతో తన జీవితంలో శూన్యం ఏర్పడిందని, ఆ లోటు తీరేది కాదని ఆయన అన్నారు. వైయస్సార్ జీవించి ఉంటే సంక్షేమ పథకాల అమలులో లోటుపాట్లు ఉండేవి కావని ఆయన అన్నారు. పాదయాత్ర తర్వాత వైయస్సార్ వ్యక్తిత్వంలో మార్పు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైయస్సార్ జయంతి రోజు శుక్రవారం వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్లీనరీ జరగబోతుండగా వివిధ తెలుగు టీవీ చానెళ్ల ప్రతినిధులతో కెవిపి రామచందర్ రావు మాట్లాడడం ప్రత్యేకతను సంతరించుకుంది. దాదాపు అన్ని ప్రధాన టీవీ చానెళ్లు ఆయనతో మాట్లాడాయి. వైయస్సార్‌తో తన అనుబంధాన్ని ఆయన నెమరేసుకున్నారు.