14న కేంద్ర మంత్రి వర్గ విస్తరణ: రేసులో కావూరి

ప్రస్తుతం తెలంగాణ అంశంపై తీవ్రమైన వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మంత్రి వర్గంలో ఎవరికీ చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. ఒకవేళ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తే మాత్రం కావూరికి చోటు దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. డిఎంకె నుంచి మంత్రి పదవుల కోసం పోటీ తీవ్రంగా జరుగుతోంది. దయానిధి మారన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పోటీ తీవ్రమైంది. డిఎంకె యుపిఎ నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అయితే, డిఎంకె నుంచి కొత్తగా మంత్రివర్గంలో ఎవరూ చేరకపోవచ్చునని భావిస్తున్నారు.
రైల్వే మంత్రి మమతా బెనర్జీ స్థానంలో తృణమూల్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడికే ఆ పదవి దక్కే అవకాశాలున్నాయి. కాంగ్రెసుకు చెందిన కొంత మందికి కూడా మంత్రివర్గంల స్థానం లభించవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కూడా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు రాజీనామా చేసిన నేపథ్యంలో హనుమంత రావుకు అవకాశం దక్కవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications