వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై ఆరోణలు: కోర్టుకు సినీ హీరో రాజశేఖర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవిపై , ఆయనకు సబంధించిన బ్లడ్‌బ్యాంక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అభిమానులు దాఖలు చేసిన ఓ కేసుకు సంబంధించి సినీ నటులు రాజశేఖర్‌, జీవిత దంపతులు శుక్రవారం రంగారెడ్డి జిల్లా మియాపూర్‌లోని కూకట్‌పల్లి కోర్టుకు హాజరయ్యారు. తమ న్యాయవాది మహేందర్‌రెడ్డితో వారు కోర్టుకు కలిసి వచ్చారు. వారు న్యాయమూర్తి ఎదుట హాజరై తమ వాదనలు వినిపించారు. సినీనటులు రావడంతో వారిని చూసేందుకు పరిసర ప్రాంతవాసులు తరలివచ్చారు.

బ్లడ్‌బ్యాంక్‌ స్థాపించి సేవ చేస్తున్న చిరంజీవిపై తరచూ రాజశేఖర్‌, జీవిత దంపతులు అర్ధంలేని ఆరోపణలు చేయడం తగదని ఆ పార్టీ నాయకులు హితవుపలికారు. శుక్రవారం మియాపూర్‌లో ఆ పార్టీ గ్రేటర్‌ కార్యదర్శి తూము మనోజ్‌కుమార్‌, శేరిలింగంపల్లి పార్టీ కన్వీనర్‌ సమ్మెట ప్రసాద్‌ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కేవలం ఉనికి నిలబెట్టుకోవడానికి అసత్యపు ఆరోపణలు చేయడం ఈ దంపతులకు అలవాటైందని అన్నారు. పునరావృతం అయితే పార్టీ కార్యకర్తలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కార్యక్రమంలో కె.సుధాకర్‌, కె.ఎల్‌.ఎన్‌.స్వామి, షైజ తదితరులు పాల్గొన్నారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై రాజశేఖర్, జీవిత తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రజలకు సేవ చేయాల్సిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ప్రజలకు సేవ చేయడం లేదని వారు ఆరోపించారు. జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఓ కమిటీని కూడా వేసింది. కమిటీ బ్లడ్ బ్యాంకుకు క్లీన్‌చిట్ ఇచ్చింది.

English summary
Hero Rajasekhar and his wife Jeevitha attended the court today in case filed by Chiranjeevi fans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X