సోనియా తప్పు చేశారు అందుకే....: విజయమ్మ

YS Vijayamma
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అకాల మృతితో మరణించిన వారిని ఓదార్చడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒప్పుకోనందువల్లే జగన్ పార్టీ నుండి బయటకు వచ్చి పార్టీ పెట్టవలసి వచ్చిందని పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ శుక్రవారం ఇడుపులపాయ ప్లీనరీలో మాట్లాడుతూ అన్నారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ ఎందుకు స్థాపించారో ప్రజలకు కార్యకర్తలు చెప్పాలని పిలుపునిచ్చారు. తండ్రి బాటలోనే జగన్ పయనిస్తున్నారన్నారు. ఓదార్పు యాత్రపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరణ ఇచ్చామని అయినా ఆమె ఒప్పుకోలేదన్నారు.

అయితే తండ్రి మృతి చెందిన సమయంలో తాను ఓదార్చుతానని మాట ఇచ్చినందు వల్ల మాట తప్పని వైయస్ తనయుడిగా తాను మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని భావించి జగన్ అధిష్టానం వద్దన్నా ఓదార్పుకు సిద్ధమయ్యాడని చెప్పారు. వైయస్ ప్రతిరూపం జగన్ అన్నారు. జగన్ ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా అడ్డుకోగలడని అన్నారు. ధైర్యంగా ముందుకు వెళ్లే స్థైర్యం ఉందన్నారు. పోరాడేతత్వం ఉన్న జగన్‌ను రాష్ట్ర ప్రజలు ఆదరించాలని కోరారు. దివంగత వైయస్‌లో ఉన్న అన్ని లక్షణాలు జగన్‌లో ఉన్నాయన్నారు. జగన్ తన తండ్రి బాటలోనే జనం కోసం తాపత్రయపడుతున్నారని అన్నారు. జగన్, వైయస్ తండ్రీ కొడుకుల్లా కాకుండా స్నేహితులుగా ఉండే వారన్నారు. జగన్ వైయస్ కాలం నాటి స్వర్ణయుగం తీసుకు వస్తారని అన్నారు.

వైయస్ ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో వైయస్ చూపించారన్నారు. వైయస్ ఎప్పుడూ ప్రజల్లో ఉండటానికే ఇష్టపడే వారన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు వైయస్ రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. స్వాతంత్రం వచ్చాక ఏ సిఎం ఏ రాష్ట్రంలో ఇన్ని పథకాలు ప్రవేశ పెట్టలేదన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం వైయస్‌ది అన్నారు. వైయస్ ఎన్నో పథకాలకు రాజీవ్, ఇందిర పేర్లు పెట్టారని గుర్తు చేశారు. వైయస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటల నిలబెట్టుకున్నారన్నారు. ఆయన మాటలతో కాకుండా చేతలతో చూపించారని అన్నారు. వైయస్‌తో జీవించే భాగ్యం తనకు లేదన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చి చిరస్థాయిగా నిలిచారన్నారు. వైయస్ జలయజ్ణం పూర్తి చేయాలని భావించారని అన్నారు. విజయమ్మ మాట్లాడిన తర్వాత జగన్ కార్యకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు వైయస్‌కు నివాళులు అర్పించి జెండాను ఆవిష్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+