అజర్‌కు మంత్రి పదవి, చిరుకు గుండు సున్నా?

Chiranjeevi
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మల్లగుల్లాలు పడుతున్నారు. సోనియా ఒక విధంగా ఆలోచిస్తుండగా, మన్మోహన్ సింగ్ మరో రకంగా ఆలోచిస్తున్నారు. ఇరువురికి మధ్య పొత్తు కుదరడం లేదని తెలుస్తోంది. రాజకీయ సమీకరణాలే ప్రధానం కావాలని సోనియా ఆలోచిస్తున్నారు. అయితే, తనకు తోడునీడగా నిలిచేవారిని మంత్రులుగా ఎంపిక చేసుకోవాలని ప్రధాని అనుకుంటున్నారు. దీంతో రేపు సోమవారం జరగాల్సిన మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ, మంగళవారానికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో సోనియా ఉన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ మాజీ క్రికెటర్ మొహ్మద్ అజరుద్దీన్‌కు మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు మంత్రివర్గంలో కొత్తగా ప్రాతినిధ్యం కల్పించడానికి సోనియా గాంధీ సిద్ధంగా లేరు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో రాష్ట్రానికి చెందినవారిని మంత్రివర్గంలోకి తీసుకోకూడదని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన చిరంజీవికి కూడా మొండిచేయే చూపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన చేస్తున్నారు.

రాష్ట్రం నుంచి కావూరి సాంబశివరావు, కిశోర్ చంద్రదేవ్, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. సహాయ మంత్రులుగా ఉన్న పనబాక లక్ష్మి, దగ్గుబాటి పురంధేశ్వరి ప్రమోషన్ ఆశిస్తున్నారు. నిజానికి, కిశోర్ చంద్రదేవ్‌కు లోకసభ స్పీకర్ పదవి దక్కాల్సి ఉంది. కానీ, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సుముఖంగా లేకపోవడం ఆయనను పక్కన పెట్టారు. అప్పటి నుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో కిశోర్ చంద్రదేవ్ ఉన్నారు. కానీ ఆయన ఆశలు ఈసారి కూడా వమ్ము అయ్యేట్లే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+