వైయస్ జగన్ పార్టీకి అంత సీన్ లేదు: ముఖ్యమంత్రి

Kirankumar Reddy
రాజమండ్రి: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంత సీన్ లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో పాల్గొన్న శాసనసభ్యులపై తగిన సమయంలో చర్యలు ఉంటాయని, దీనిపై స్పీకర్ చర్యలు తీసుకుంటారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పారు. 'సాగు రైతుల రక్షణ హస్తం' పథకాన్ని ప్రారంభించడానికి ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ప్రకటించిన విధానాలపై మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు - వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. ఆ పార్టీ గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి వెనక్కి రావాలని జగన్ వెంట వెళ్లిన శానససభ్యులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ అంశం చాలా సున్నితమైందని, రాజీనామాల వ్యవహారం సర్దుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని మంత్రులను తానే కాకుండా పార్టీ అధిష్టనం కూడా అడుగుతున్నట్లు ఆయన తెలిపారు. కొత్త ఆర్డినెన్స్ ద్వారా 26 లక్షల మంది సాగు రైతులకు లబ్ధి చేకూరనుందన్నారు. వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్ట్రంలో కోటి మంది రైతులకు రూ.44 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని త్వరలోనే కొనుగోలు చేస్తామన్నారు. రంగుమారిన ధాన్యాన్ని కూడా నిబంధనలను సడలించి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు త్వరలో జాతీయ హోదా వస్తుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+