గుంటూరు: గుంటురు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు నిమ్మగడ్డ శివరామకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో ఆదివారం ఉదయం కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు. అయితే కొద్దిసేపటికే ఆయన అంతిమ శ్వాస విడిచారు. తెలుగుదేశం పార్టీ నుంచి మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన శివరామకృష్ణ ప్రసాద్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు.
ఆయన వయస్సు ఆరవై అయిదేళ్లు. తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభకు ఎన్నికై ఒక పదవీకాలం పూర్తిచేశారు. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.