తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాదు: వైయస్ వివేకా

YS Vivekananda Reddy
కడప: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించాల్సిన సమయం ఇది కాదని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి ఆదివారం అభిప్రాయపడ్డారు. కడపలో సమైక్యాంధ్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన అభివృద్ధిపై చర్చ జరిగిన తర్వాతే రాష్ట్రాల విభజన జరగాలని అన్నారు. సమైక్యాంధ్రలో రాయలసీమ ప్రాంతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు.

ఇతర ప్రాంతాలతో సమానంగా రాయలసీమ ప్రాంతం సైతం అభివృద్ధి చెందే వరకు రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదన్నారు. తెలంగాణ సెంటిమెంటును తాను గౌరవిస్తానని అయితే మిగతా వారి స్థాయిలో మా ప్రజలను, మమ్మలన్ని అభివృద్ధి చేసిన తర్వాతే ప్రత్యేక రాష్ట్రం అడగాలని తెలంగాణ వారికి సూచించారు. మా ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాలని అన్నారు. ఈ నెల 14న సమైక్యాంధ్ర కోసం నిరసన కార్యక్రమాలు చేపడతాన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+