కెకె, మందా ఇతర తెలంగాణ కాంగ్రెసు ఎంపిల అరెస్టు

పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, మందా జగన్నాథం, మధు యాష్కీలను, శాసనసభ్యుడు రాజయ్యను పోలీసులు అరెస్టు చేశారు. తమను ప్రభుత్వం అణచివేస్తోందని, తమకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి వెళ్లి విద్యార్థులను పరామర్శించే హక్కు ఉందని పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. పోలీసుల తీరుపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు సామూహిక నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. వారిని పరామర్శించేందుకు వారు ఉస్మానియాకు వెళ్లారు.












Click it and Unblock the Notifications