టి - టిడిపిలో నేతల్లో విభేదాలు, అదేమీ లేదన్న ఎర్రబెల్లి

తమ మధ్య ఏ విధమైన విభేదాలు లేవని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం అన్నారు. నల్లగొండ జిల్లా బస్సు యాత్ర విషయంలో ఆ జిల్లా నాయకులు పదే పదే రూట్లు మారుస్తున్నారని, ఈ విషయంపై నల్లగొండ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుతో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆమరణ దీక్ష చేపట్టిన విద్యార్థులకు ఏదైనా హాని జరిగితే తమ బస్సు యాత్రను అక్కడికి మళ్లిస్తామని ఆయన హెచ్చరించారు. తెరాస పదేళ్లు పోరాటం చూసి కూడా తెలంగాణను సాధించలేకపోయిందని, తమకు ఒక ఏడాది ఇస్తే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications