నాగం, హరీష్ రావు అరెస్టు, సిఎంపై కెటిఆర్ ఫైర్

కాగా అంతకుముందు మీడియా పాయింటు వద్ద నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న పోలీసు బలగాలను వెంటనే వెనక్కి పిలిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యయుతంగా మద్దతు తెలిపే హక్కు అందరికీ ఉందని అయితే విద్యార్థుల దీక్షను అడ్డుకోవడానికి ప్రయత్నించడం ద్వారా నిరసన తెలిపే హక్కును హరించి వేస్తుందన్నారు. ప్రభుత్వం ఇలాగే చేస్తే ఉద్యోగ సంఘాలు సహాయనిరాకరణకు సిద్ధంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం చాప్టర్ 8ని ప్రయోగించడం మానుకోవాలని సూచించారు. విద్యార్థుల దీక్షను అడ్డుకోవడం అప్రజాస్వామికం అని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు.












Click it and Unblock the Notifications