బంగారం ధరల దెబ్బ ముందుంది..

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా కొనసాగాయి. సెలవు దినం కావడంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్ కొనసాగట్లేదు. కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా లైవ్ ట్రేడింగ్ ధరలు అందుబాటులో లేవు. కమోడిటీ మార్కెట్‌లో 24 క్యారెట్లు, 22 క్యారెట్ల బంగారం ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. వెండి ధరల్లో కూడా స్వల్ప కదలికలు మాత్రమే నమోదయ్యాయి.

ఇండియన్ బులియన్ అసోసియేషన్ (IBA) డేటా ప్రకారం.. నేడు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,55,750 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా, ఆభరణాల తయారీలో విస్తృతంగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,42,772 రూపాయలుగా రికార్డయింది. మరోవైపు కిలో వెండి 999 ఫైన్ ధర 2,49,090 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మార్కెట్‌లో బంగారాన్ని ప్రధానంగా 24, 22 క్యారెట్ల స్వచ్ఛతతో విక్రయిస్తుంటారు.

MCX Closure on Weekends Keeps Live Gold Quotes on Pause as 24K Stands at 155750 per 10g 22K and 18K

24 క్యారెట్ల బంగారం అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు. 22 క్యారెట్ల బంగారం మరింత దృఢంగా, ఆభరణాల తయారీకి అనువుగా ఉండటంతో దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రధాన నగరాల్లో ధరల వివరాలను పరిశీలిస్తే, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,200, 22 క్యారెట్లు రూ. 1,42,267 వద్ద ఉండగా, వెండి రూ. 2,48,210 ల వద్ద స్థిరపడింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,460, 22 క్యారెట్లు రూ. 1,42,505, వెండి రూ. 2,48,640గా నమోదయ్యాయి.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,590, 22 క్యారెట్లు రూ. 1,42,624, వెండి ధర కిలో రూ. 2,48,840 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,260, 22 క్యారెట్లు రూ. 1,42,322, వెండి రూ. 2,48,310 వద్ద ట్రేడ్ అయ్యాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,710, 22 క్యారెట్లు రూ. 1,42,734, వెండి ధర రూ. 2,49,030గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,55,920, 22 క్యారెట్లు రూ. 1,42,927, వెండి రూ. 2,49,360గా నమోదైంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారకపోవడం, శాంతి చర్చలు కొలిక్కి రాకపోవడం, అమెరికా ఫెడ్ విధానాలు, రిజర్వ్ వడ్డీ రేట్లు ప్రభావం ఈ వారంలో బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో దేశీయ బులియన్ మార్కెట్ పై అందరి చూపూ నిలిచింది. సోమవారం నాటి ట్రేడింగ్ లో బంగారం, వెండి ధరలు అమాంతం ఎగబాకవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+