తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయు విద్యార్థులు టెర్రరిస్టులు కాదు: డిజిపి దినేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DPG Dinesh Reddy
చిత్తూరు: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నది విద్యార్థులే కానీ తీవ్రవాదులు కాదని ఆంధ్ర ప్రదేస్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు దినేష్ రెడ్డి సోమవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసులు తెలంగాణ అంశాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. పోలీసులకు ప్రాంతాలతో సంబంధం లేదన్నారు. శాంతిభద్రతలే తమకు ముఖ్యమన్నారు. అందరికీ భద్రత కల్పించడమే తమ లక్ష్యమన్నారు. అవసరం మేరకే అరెస్టులు చేశామని చెప్పారు.

తిరుమలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. ఆర్జిత కుంభకోణం కేసును సిఐడికి బదలీ చేస్తున్నట్టు చెప్పారు. టిటిడి నిధులతో తిరుమలలో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. హిందూ ఎండోమెంట్ యాక్ట్ పరిధిలోకి తిరుమలను తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. స్కానర్లు, మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ డిటెక్టర్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ను త్వరలో పట్టుకుంటామని అన్నారు. భానును అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి 8 గంటల వరకు సబ్ కంట్రోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

English summary
DPG Dinesh Reddy said today that Osmania University students are not terrorists. He talk with media in tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X