వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం టి-కాంగ్రెసు నిరాహార దీక్ష

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Jana Reddy
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు టి-కాంగ్రెసు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సులో సమావేశం అయిన తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. నిరాహార దీక్షలకు వేదికగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్సును చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 16 మందితో కూడిన ఓ కోర్ కమిటీని సైతం వేసినట్లుగా తెలుస్తోంది. ఈ కమిటీలో 16 నండి 20 మంది వరకు ఉంటారని తెలుస్తోంది. మొదట 9 మందితో కూడిన కమిటీ వేయాలనుకున్నప్పటికీ ఆ తర్వాత 16కు పెంచినట్లుగా తెలుస్తోంది. దీనికి కన్వీనర్‌గా మంత్రి బస్వరాజు సారయ్య ఉంటారని తెలుస్తోంది. కాగా ఈ సమావేశానికి ముగ్గురు మంత్రులు హాజరు కాగా తొమ్మిది మంది మంత్రులు హాజరు కాలేదు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ తమతో పనిచేసేందుకు సిద్దపడినా తాము అందుకు సిద్ధంగా లేమని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో బస్సు యాత్రను, సీమాంధ్రలో పాదయాత్రను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ముందు తన వైఖరి బయట పెట్టాలన్నారు. ఉద్యమంలో టిడిపితో వెళ్లే ప్రసక్తి లేదన్నారు. ఎర్రబెల్లి తమతో కలుస్తామని చెప్పినా మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కాంగ్రెసుకు, టిడిపికి సంబంధం లేదన్నారు. మంత్రులు ఎవరూ సచివాలయానికి వెళ్లడం లేదని అన్నారు. అధిష్టానం తెలంగాణ ప్రకటించే వరకు ఉద్యమిస్తామని అన్నారు. తెలంగాణే తమ అంతిమ లక్ష్యం అన్నారు. విద్యార్థుల దీక్షకు మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వంతో, పార్టీతో తాము తెగతెంపులు చేసుకోలేదన్నారు. ఒత్తిడి తెచ్చేందుకే తాము రాజీనామాలు చేశామని చెప్పారు.

తెలంగాణ ఉద్యమాన్ని కొందరు అవహేళన చేస్తున్నారని మరికొందరు తక్కువ చేసి చూపిస్తున్నారని ఇది సరికాదని మంత్రి జానారెడ్డి అన్నారు. మీడియా ప్రజల మనోభావాలను ప్రతిబింబించేలా చేయాలని సూచించారు. ప్రాంతాలుగా రాష్ట్రం విడిపోయినప్పటికీ మానసికంగా కలిసే ఉందామని జానారెడ్డి సీమాంధ్రులకు సూచించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులం కాంగ్రెసు పార్టీని కాపాడుకుంటూ, ప్రభుత్వాన్ని కాపాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతామన్నారు. ప్రజాభీష్టాన్ని కాపాడాలనే ఉద్దేశ్యంతోనే తాము సహనంతో వెళుతున్నామని అన్నారు. కాంగ్రెసు పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వీడేది లేదన్నారు. మంత్రులు సైతం తెలంగాణ ఉద్యమంలో తమతోనే ఉన్నారని కొన్ని కారణాల వల్ల వారు కార్యక్రమాలలో పాల్గొననప్పటికీ వారు ప్రజల వెంటే ఉన్నారని అన్నారు. మహాభారతంలో వలె మాది ధర్మయుద్ధం అని చెప్పారు.

English summary
Telangana congress leaders will be taking fast for seperate telangana. They met today in nampaly exibhition ground.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X