ఆజాద్ షాక్, తెలంగాణ డిమాండుపై మొండిచేయి

తెలంగాణలో సెంటిమెంటు ఉన్నట్లుగానే సీమాంధ్రలో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సీమాంధ్రులు వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల తెలంగాణ నాయకుల ఒత్తిడికి లొంగలేమని ఆయన అన్నారు. రాష్ట్రంలోని శాసనసభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేనంత వరకు తెలంగాణపై కేంద్రం ఏమీ చేయలేదని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ పరిష్కారం చూపుతుందని భావిస్తే ఆ పని చేయలేకపోయిందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఆరు ప్రత్యామ్నాయాలను చూపిందని, అవి ఆచరణ సాధ్యం కావని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ పరిష్కార మార్గం చూపకపోవడంతో తెలంగాణపై మళ్లీ సున్నా నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుందని ఆయన అన్నారు. శాసనసభ తీర్మానం చేయకుండా అంగుళం కూడా ముందడుగు వేయలేమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications