భాను పేరు చెప్పి సినీ పెద్దలను బెదిరించిన కళ్యాణ్?
State
oi-Pratapreddy
By Pratap
|
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ పేరు చెప్పి తెలుగు సినీ నిర్మాత సి. కళ్యాణ్ సినీ పరిశ్రమలోనే పెద్దలను కూడా బెదిరించినట్లు వార్తలు వస్తున్నాయి. భాను కిరణ్‌తో తనకు సంబంధం లేదని కళ్యాణ్ ఓ టీవీ చానెల్‌కు చెప్పిన మాటల్లో వాస్తవం లేదని చెప్పే వార్తలు వెలువడుతున్నాయి. సిఐడి విచారణలో తనకు భానుతో గల సంబంధాలను ఆయన వెల్లడించినట్లు చెబుతున్నారు. భాను, సూరిలకు కళ్యాణ్ బినామీగా ఉన్నాడని, అతని పేరు మీద వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయని అంటున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూర్, మంగళూర్‌ల్లో కళ్యాణ్ పేరు మీద భారీ ఆస్తులున్నట్లు సిఐడి విచారణలో తేలిందని చెబుతున్నారు. ఈ మేరకు ఓ టీవీ చానెల్ మంగళవారం సాయంత్రం ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది.
భాను, సూరిలను అడ్డుపెట్టుకుని కళ్యాణ్ పెద్ద యెత్తున భూముల సెటిల్మెంట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. సూరిని హత్య చేసిన తర్వాత భాను కిరణ్ కళ్యాణ్‌తో కాంటాక్టులో ఉన్నట్లు సమాచారం. సూరిని చంపుతున్నట్లు తనకు భాను ముందుగా చెప్పలేదని కళ్యాణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఫోన్ చేసి తాను సూరిని చంపానని, సూరి మనుషులు తనను చంపుతారని, అందువల్ల కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్తున్నానని భాను తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. కాగా, భాను కిరణ్ ఎవరికీ ఫోన్ చేయడం లేదని సిఐడి వర్గాలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అతను కొరియర్ వ్యవస్థను వాడుకుంటున్నాడని, కొరియర్ల ద్వారా భాను ఖాతాలో డబ్బులు జమవుతున్నాయని అంటున్నారు.