హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెసు ఉద్యమ కమిటీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao-Jana Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టీరింగ్ కమిటీ నేతృత్వంలో వారు తెలంగాణ ఉద్యమాన్ని చేపడతారు. ఈ కమిటీలో చైర్మన్లుగా కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు, మంత్రి జానారెడ్డి ఉంటారు. కన్వీనర్లుగా పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, సమన్వయకర్తలుగా ఎంపీ వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ కమిటీలో నలుగురు అధికార ప్రతినిధులు, పదహారు మంది సభ్యులను నియమించారు. మంగళవారం ఉదయం తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఎంపీ వివేక్ ఇంట్లో భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.

అనంతరం కె కేశవరావు మాట్లాడుతూ తాము రెండో ఎస్సారెస్సీకి ఒప్పుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అయితే సీమాంధ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హైదరాబాదుపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులకు కేంద్ర మంత్రి పదవులు దక్కడం కష్టమని ఎంపీ పొన్నం వివేక్ అన్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని తెలంగాణ ముఖ్యమన్నారు. తమకు పదవులు దక్కక పోవడం సంతోషంగా ఉందని మరో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

English summary
Telangana congress leaders make a stearing committee for telangana. KK and Jana Reddy are elected as chairman. Saraiah and Ponnam Prabhakar as convenor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X