ఆజాద్ వ్యాఖ్యలపై భగ్గుమన్న తెలంగాణ నేతలు

Gulami Navi Azad
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ అంశం విషయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ చైనాలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సీమాంధ్రుల ఏకాభిప్రాయం కుదరదని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు సోమవారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తెలంగాణపై ఏకాభిప్రాయం అనడం విచారకరమన్నారు. గత యాభై ఏళ్లుగా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఉత్తరాఖండ్, ఉత్తరాంచల్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు తెలంగాణకు పోలిక లేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా గత నాలుగు వందల సంవత్సరాలుగా ఉందని 1956లో ఆంధ్రలో కలసిందని గుర్తు చేశారు. తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని వేసిన కేంద్రం ఇప్పుడు ఆ కమిటీలో తప్పులు వెదకడం ఏమిటని అన్నారు. ఆజాద్ చైనాలో కామెంట్ చేశాడో లేదో పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతానని చెప్పారు. తెలంగాణతో మిగిలిన ప్రాంతాలకు ఆజాద్ పోలిక పెట్టడం సరికాదన్నారు. కావాలంటే ఆజాద్ చరిత్ర చూడవచ్చని సూచించారు. తెలంగాణ కోసం మళ్లీ విద్యార్థులు ప్రాణత్యాగం చేసుకోవాలా అని ప్రశ్నించారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు అన్నదమ్ముల్లా విడిపోవడం మంచిదని విహెచ్ అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర సమితి సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు సైతం ఆజాద్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆజాద్ ప్రకటన బాధ్యతారాహిత్యంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆయన ప్రకటన ఉందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో తీర్మానం కావాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. విచక్షణాధికారంతో తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసిసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చే బాధ్యత కాంగ్రెసు పార్టీదే అన్నారు. 2004లో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఆజాద్‌కు తెలంగాణ విషయం తెలియదా అని ప్రశ్నించారు. కాగా తెలంగాణకు ఏకాభిప్రాయం కావాలని, తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని, తెలంగాణ తరహాలు సీమాంధ్రలో సైతం సెంటిమెంటు ఉందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+